అమ్మవారు రకరకాల రూపాలలో అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సువేషాఢ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 969 వ నామం . 

" సువేషాఢ్యా " అంటే చక్కని మంగళకరమయిన వేషముతో ఒప్పుచున్నది అని. శంకరులు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ నూరు శ్లోకాలతో సౌందర్యలహరి చేసారు. మూక శంకరులు 500 శ్లోకాలతో మూకపంచశతి చేసారు. అమ్మవారి అందాన్ని వర్ణించడం సామాన్యులకు సాధ్యమా. అమ్మవారు అంత అద్భుత సౌందర్యవతి కనుక ఏ వేషంలో అయినా అద్భుతంగానే ఉంటారు.

భక్తితో శరణాగతి అన్న మహామహులకు బాలగా, శ్యామలాదేవిగా, కామాక్షీదేవిగా, కమలాంబగా అనుగ్రహిస్తారు. 

మూకశంకరులు ఆర్యాశతకంలో ఓ అద్భుత వర్ణన చేస్తారు:

" మదజలతమాలపత్రా వసనితపత్రా   

  కరాదృతఖానిత్రా,

  విహరతి పులిందయోషా గుంజాభూషా   

  ఫణీంద్రకృతవేషా " - ఆర్యాశతకం:85

అమ్మవారు ఆకులను వస్త్రాలుగా చుట్టుకుందిట. పూసలు వేసుకుందిట. గడ్డపార చేతిలో పట్టుకుందిట. దొప్పలలోని మదజలాన్ని త్రాగుతూందిట. కిరాతస్త్రీ యొక్క విచిత్రవేషంతో వెలిగిపోతూందిట. 

ఆశ్చర్యంగా ఉందికదా. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఘోర తపస్సు చేసాడు. శివుడు కిరాతుడి వేషంలో వచ్చారు. మరి అమ్మవారు ప్రక్కనే ఉంటారు కదా. ఆవిడ కిరాతస్త్రీ వేషంలో ఉన్నారని తెలియచేస్తున్నారు మూకశంకరులు.

అలా రకరకాల చక్కని విచిత్రవేషాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అమ్మవారు. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ