" ఏ అహారాన్ని తీసుకుంటూన్నా నీకు నివేదన చేసాకే తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ " అని వేడుకోవాలి.- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ధనధాన్యవివర్ధినీ " అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 886 వ నామం. 

ధనాన్ని, ధాన్యాన్ని అధికంగా ఇస్తారు అమ్మవారు అని అర్ధం.

ధనం అంటే ధన్యతని ఇచ్చేది అని అర్ధం. కష్టపడి సంపాదించిన దాంట్లో కొంతభాగం సత్కార్యాలకి అంటే దానధర్మాలకి ఉపయోగించుకుని ధన్యులవచ్చు అని అర్ధం.

ధాన్యాన్ని అంటే అహారాన్ని అధికంగా ఇచ్చేదీ అమ్మవారే. 

అన్నీ అమ్మవారే ఇస్తారు. ఎప్పుడు. ధర్మబద్ధంగా జీవించినప్పుడు. తుఫాన్ లేక భూకంపం వచ్చింది. బ్రతకాలంటే అన్నపుముద్దో, గుక్కెడు పాలో కావాలి. కోట్లరూపాయలు, బంగారం ఉన్నా ఉపయోగముండదు. అందుకని డబ్బుని ధన్యత పొందడానికే ఉపయోగించాలి.

నారాయణ తీర్థులు తన తత్వ ప్రచారణ నిమిత్తం కాశీ వెళ్లారు. కాశీలో వారు గదిలో కూర్చుని తరంగాలు పాడుతుంటే అందెల/గజ్జెల ధ్వని వినబడేది. ఆయనని సరైన యతి కాదని అనుమానించి వారికి బిక్ష కూడా ఇవ్వరు ఎవ్వరూ. అయినా వారు కీర్తనలు తన్మయత్వంతో పాడుతూంటే వారి శిష్యులు తలుపు రంధ్రంలో నుండి చూడగా ఒక ముసలి ముత్తైదువ వారికి ఆహారం పెడుతూండడం చూసి ఆశ్చర్యపోతారు. ఆమె సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి. కొందరు పైకప్పు ఎక్కి చూస్తే ఎందరో కృష్ణులు తాళం మృదంగం ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉండడం, ఒక కృష్ణుడు ఈయన పాడుతూన్న తరంగాలు వ్రాస్తూ కనబడతారు. అంతటి అనన్యభక్తి, తన్మయత్వం ఆయనది. భక్తులకు ఏలోటూ రానివ్వరు.

అహారానికి 3 దోషాలు ఉంటాయి. అవి 1. జాతి దోష - ఉల్లి ముల్లంగి మొదలైనవి తామస ఆహారం. 2. ఆశ్రిత (పాత్ర) దోష - పాలు కొబ్బరినీరు మంచివే కాని రాగిపాత్రలో ఉంచితే పాడవుతాయి, అనారోగ్యం తెస్తాయి. 3. నిమిత్త దోష - పండించే ప్రదేశం మంచిది కాకపోవడం. 

ఎక్కడ పండిందో మాకెలా తెలుస్తుంది అనుకోవచ్చు. అందుకే అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటే ఈ దోషం ఉండదు. 

అందుకని అమ్మవారిని " ఏ అహారాన్ని తీసుకుంటూన్నా నీకు నివేదన చేసాకే తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ " అని వేడుకోవాలి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ