శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భగమాలినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 277 వ నామం.

" భగమాలినీ " అంటే షడ్గుణైశ్వర్యములను ధరించినది అని భాష్యం చెప్పారు.

"మాహాత్మ్యస్య సమగ్రస్య 

ధెైర్యస్య యశసశ్శ్రియః జ్ఞాన 

వైరాగ్యయోశ్చైవ షణ్ణాం - భగ, ..... 

ఇత్యుక్త భగో౽స్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్రోక్తం.

1.మాహాత్మ్యం 2.ధైర్యం 3.యశస్సు 

4.సంపద 5. జ్ఞానం 6. వైరాగ్యం

ఈ ఆరింటిని షడైశ్వర్యాలు అంటారు. వీటికే "భగ" అని పేరు. 

ఈ ఆరు ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే " భగవంతుడు " అని కొలుస్తాం.

ఈ ఐశ్వర్యాలలో సంపద నాలుగవది. 

సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు. తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద. సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది.

1.ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్దీ సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది. కొందరు వ్యాపారస్తుల గురించి " వారి సంపద నిముషానికి ఇంత పెరుగుతూంది " అని చెబుతూంటారు. ఆ సంపద ఊరికే రాదు. వారు శ్రమపడుతూ ఇతరుల అవసరాలు తీరుస్తూన్నంతవరకే పెరుగుతూ ఉంటుంది.

2.క్రియాశక్తి వల్ల. లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి. సంపద అనేది శ్రమకు ప్రతిఫలం. శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది. 

ఇలా శ్రమపడే వారికి ఎక్కడ ఉన్నా జీవితం సుఖంగా జరిగి పోతుంది. ఎవరిమీదా ఆధారపడనక్కరలేదు. ఎవరినీ యాచించనక్కరలేదు.

ఇటువంటి శక్తిని అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.

ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు.

అందరికీ కష్టపడే మనస్తత్వాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీలక్ష్మీదేవిపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ