అనన్యభక్తి అలవడితే వేరే ఏ సాధనా అవసరం ఉండదు - సూర్యనారాయణ చీమలపాటి

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

ఆదిశంకరులు శివానందలహరి గానం చేస్తూ శివుని ఇలా ప్రార్ధించారు:

నాలం వా సకృదేవ దేవ భవతః

సేవా నతిర్వా నుతిః

పూజా వా స్మరణం కథాశ్రవణ

మప్యాలోకనం మాదృశామ్,

స్వామిన్నస్థిరదేవతానుసరణా

యాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః

కుతో భవతి చేత్కిం ప్రార్థనీయం తదా ॥33||

" ఓ శివా, నిన్ను ఒకసారి సేవించినా, నమస్కరించినా, స్మరించినా, పూజించినా, దర్శించినా, నీ కధను విన్నా చాలును కదా. ఇంతకంటే ముక్తి ఏమున్నది?. మావంటి వారికి ఈ విధంగానే ముక్తి కలుగుతూన్నప్పుడు ఇతర అశాశ్వత దేవతలను పూజించడం ద్వారా అలసిపోవడం తప్ప నేను ఏమి పొందగలను " అని.

కృష్ణ పరమాత్మ గోపికలకు ముక్తిని ప్రసాదించారు. వారేమీ వేదశాస్త్రాలు చదవలేదు, ప్రత్యేక సాధన, తపస్సు చేసింది లేదు. ఉదయమే పిల్లలను లేపడానికి కృష్ణుడిని లేపుతూన్నట్లు పాట పాడేవారు. స్నానం చేయిస్తూంటే కృష్ణుడికి స్నానం చేయిస్తూనట్లు, బట్టలు తొడుగుతూంటే కృష్ణుడికి తొడిగినట్లు, అన్నం తినిపిస్తే కృష్ణుడికి తినిపించినట్లు - అలా ఎప్పుడూ కృష్ణుడి ధ్యాసే. అదే అనన్య భక్తి. ఏది చేసినా పరమాత్మ పరంగానే. వారికి ముక్తి లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.

విద్యాభ్యాసం అయి మథురకు వచ్చిన కృష్ణుడు ఉద్దవుడిని బృందావనం వెళ్ళిరమ్మన్నారు. ఎందుకు ఏమిటి అని కృష్ణుడు చెప్పలేదు, ఉద్దవుడు అడగలేదు. అడగడు కూడా. ఊరికే ఎందుకు పంపిస్తారు. ఉద్దవుడు పరమభక్తుడు. అనన్యభక్తి అంటే ఏమిటో గోపికల నుంచి తెలుసుకోవడానికి పంపించారు ఉద్దవుడిని బృందావనంకి. అలా అనుగ్రహిస్తారు భక్తులను భగవంతుడు.

ఇదే శంకరులు కూడా తెలియచేసినది పై శ్లోకంలో.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ