ద్రవ్యమయ యజ్ఞాలకన్నా జ్ఞానయజ్ఞమే నయమని తెలియచేసారు పరమాత్మ గీతలో - చీమలపాటి సూర్యనారాయణ

🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏


" శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్
  జ్ఞానయజ్ఞః పరంతప,
  సర్వం కర్మాఖిలం పార్ధ
  జ్ఞానే పరిసమాప్యతే " - భ.గీత 4:33

" ద్రవ్యయజ్ఞముకన్నా జ్ఞానయజ్ఞమే శ్రేష్టమయినది. ఏలనన కర్మలన్నియును జ్ఞానమునందే పరిసమాప్తమగును " అన్నారు పరమాత్మ.

శంకరాచార్యులు " వచ్చేది గడ్డుకాలం. జీవులు సంసారసాగరంలో నిండా మునిగిపోయి నానా యాతనలు పడుతూ ఉంటారు. వారు యజ్ఞయాగాదులు అవీ ఎక్కడ చేయగలరు " అని ఆలోచించి జ్ఞానకాండను ప్రజల్లోకి తీసుకుని వెడితే ఏ నామజపమో చేసుకోవడం, ఏ అష్టకమో స్తోత్రమో చదువుకోవడమో చేసి సులువుగా తరిస్తారు అని భావించి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా శ్రమించారు.

సామాన్యులు కూడా తక్కువశ్రమతో ఎక్కువగా భగవద్కృపకు పాత్రులవడంకోసం సౌందర్యలహరి, శివానందలహరి, పంచకాలు, అష్టకాలు భజగోవిందంలను ప్రసాదించారు. పండితుల సౌలభ్యంకోసం బ్రహ్మసూత్రాలకు, విష్ణుసహస్రానికి భాష్యాలు రచించారు.

ఆయన చేసిన అద్భుత కృషివల్లే వెయ్యిఏళ్ళు పైబడి  పరాయిపాలనలో  అందరూ భ్రష్టుపట్టించాలని చూసినా  సనాతనధర్మం చెక్కుచెదరలేదు, నేటికీ నిత్యనూతనంగా ( సనాత్ + అన - సనాత్ అంటే నిత్యనూతనం ) ఉంది.

మతం అంటే అభిప్రాయం అని అర్ధం. మన ఋషుల అభిప్రాయమే అత్యుత్తమం. ఏ మతంలోనూ " వసుధైక కుటుంబం(కం), సర్వే జనాః సుఖినో భవంతు, తన్మే మనః శివసంకల్పమస్తు " లాంటివి ఉండవు. మనది ధర్మాచరణ.

అదీ మన ఆర్షధర్మం గొప్పదనం. దానికి సాటి లేదు, రాదు.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ