స్త్రీలను గౌరవించమంది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏


" సువాసిన్యర్చనప్రీతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 971 వ నామం .

" సువాసిన్యర్చనప్రీతా " అంటే సువాసినుల యొక్క అర్చనలచే సంతోషించునది అని భాష్యం చెప్పారు. అలాగే సువాసినులను పూజిస్తే కూడా ఆనందిస్తారు అమ్మవారు.

అమ్మవారి పూజ చేయడానికి ఓ ఆలంబన కావాలి. సూర్యుడు, అగ్ని, ప్రతిమ ( కలశం, శ్రీచక్రం ), యంత్రం,  సువాసిని, శ్రోత్రియుడయిన విప్రుడు - వీరిని పూజిస్తే అమ్మవారు సంతోషిస్తారు.

" స్త్రీ అంటే అర్పణ/ఆశ్రయ/అహంకారరాహిత్య భావం. శుద్దమయిన ప్రేమ " అన్నారు కృష్ణుడు భాగవతంలో.

" యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః " అని తెలియచేస్తూంది మనుస్మృతి. స్త్రీలు గౌరవింపబడే చోట దేవతలు ఆనందిస్తూ తిరుగుతూ ఉంటారుట‌. అందుకే సనాతనధర్మం స్త్రీలను గౌరవించమంది. ఇక వారిని పూజిస్తే అమ్మవారు ఆనందించకుండా ఎలా ఉంటారు.

అమ్మవారి నవరాత్రులలో సువాసినీ పూజ ఒక ముఖ్యఘట్టం. అమ్మవారికి భక్తులు చీరలు కానుకగా ఇస్తారు. వాటిని జాగ్రత్త చేసి చివరి రోజున సువాసినులకు పూజచేసి ఈ చీరలు కానుకగా ఇస్తారు. అమ్మవారు మురిసిపోతారు.

లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ తను ఏరూపంలో ఉంటానో చెబుతూ ఇంటిలో " గృహలక్ష్మి " రూపంలో ఉంటానని చెప్పింది. అందుకని ఇంటి ఇల్లాలు ఏదయినా వ్రతం చేసి ఇంకో ఇంటి ఇల్లాలికి వాయనం ఇస్తే లక్ష్మీదేవి పరమప్రసన్నురాలవుతుంది, అనుగ్రహిస్తుంది. సంశయం నాస్తి.

స్త్రీలను గౌరవిద్దాం, అమ్మవారి అనుగ్రహం పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ