అమ్మవారు సూక్ష్మాతిసూక్ష్మమయినవారు - ఎంత సూక్ష్మము అన్నది తెలుసుకోవడం కష్టమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏

" పరమాణుః " - అమ్మవారి అద్భుతనామాలు. శ్రీ లలితాసహస్రరహస్యనామాల్లో 808 వ నామం.

" పరమాణుః " అన్నది ఒక అత్యద్భుతనామం. అణువు అంటే సూక్ష్మమైనది. పరమాణువు అంటే అణువు కంటే పరమైనది అంటే అంతకన్నా చిన్నది అని అర్ధం. అంటే అర్ధం సూక్ష్మాతిసూక్ష్మమైనది అని. ఇంద్రియాలకు గోచరించేదానిని స్థూలం అంటారు, కనబడని దానిని సూక్ష్మం అంటారు. మరి అమ్మవారు ఎంత సూక్ష్మమైనది?. ఆవిడ ఎంత సూక్ష్మమైనదో తెలుసుకోవడం సాధ్యమయే పనికాదు. మనం ఎంత చిన్నది అనుకుంటే అంతకన్నా చిన్నది అమ్మవారు. మొదట అణువే చిన్నదనుకున్నారు. యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన సూత్రం " న ఇతి " అంటే ఇదికాదేమో అని తలచి ఇంకా సూక్ష్మమైనది అమ్మవారు అనుకుని ప్రయత్నం చేస్తే ఇంకా చిన్నవి కనిపెట్టబడ్డాయి. అదికూడా " న ఇతి " అనుకుని ప్రయత్నాలు మొదలెట్టారు.

2012 లో " హిగ్స్ బోసన్ " ని కనుక్కుని దానికి " గాడ్ పార్టికల్ " అని పేరుపెట్టారు. ఆరోజు విలేకరులు అడిగారు " అలా పేరు పెట్టారు, దేవుడు లేడని నిరూపిద్దామనా " అని. వారు అన్నారు " లేడనికాదు, ఉన్నాడనికాదు, సైన్స్ దేవుడు లేడని చెప్పడానికి కాదు, సత్యం తెలుసుకోవడానికే " అని. 

కెన్నెత్ ఫోర్డ్ అనే శాస్త్రజ్ఞుడు అన్నారు " ఎంత చిన్న పదార్ధాన్ని కనుక్కున్నా దానిలో ఎనర్జీ/చైతన్యం ఉంటూంది " అని.

ఎంతటి అద్భుత పరిశీలన. వేల ఏళ్ళక్రితమే అమ్మవారి చైతన్యం అతిసూక్ష్మపదార్ధాల్లో కూడా ఉందని/ఉంటుందని మన ఋషులు గ్రహించగలగడం అర్ధంచేసుకోగలగడం ఒక అద్భుతం. అమ్మవారు " పరమాణుః " అనే తన నామం ద్వారా తను అతిసూక్ష్మమైనదానిని అని తెలియచేయడం వలన " హిగ్స్ బోసన్ " ని మించి చిన్నపదార్ధం ఉండదని దానికి " గాడ్ పార్టికల్ " అని పెట్టేసారని అనుకోవాలి. ఆశ్చర్యమూ సంతోషకరమైన విషయమేమిటంటే ఈ " బోసన్ " పేరు మన భారత శాస్త్రజ్ఞుడు " బోస్ " గారిది, ఆయన చేసిన పరిశోధనలకు గుర్తుగా ఆయన పేరు పెట్టారు. 

కాని " ఇంతకన్నా ( గాడ్ పార్టికల్ కన్నా )" చిన్న పదార్ధం కనుగొన్నప్పుడు " అమ్మవారి " ఆనామం యొక్క అర్ధం తెలుసుకుని ఆశ్చర్యపోతారు, మన సనాతనధర్మం/వేదాలు ఖచ్చితంగా దైవదత్తమనే విషయం గ్రహిస్తారు శాస్త్రజ్ఞులు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ