శ్రీలలితానామం 946

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పంచయజ్ఞప్రియా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 946 వ నామం.

ఈ నామానికి అర్ధం " పంచయజ్ఞములను ఇష్టపడునది " అని.

సాధారణంగా  పంచయజ్ఞములు అంటే " బ్రహ్మ, పితృ, దైవ, భూత, మనుష్య " యజ్ఞాలు.

వేదం చెబుతూన్నది అగ్నిహోత్రం, దర్శపూర్ణమాసలు, చాతుర్మాస్యలు, పశు, సోమములు అనే పంచయజ్ఞాలు.

యజ్ఞం వేరు, యాగం వేరు. " యజ్ఞానాం జపయజ్ఞోస్మి " అన్నారు పరమాత్మ గీతలో. ఏ పని చేసినా యజ్ఞంలా శ్రద్ధగా చెయ్యాలంటారు. 

యాగాన్ని ఒక యజ్ఞం అనుకోవచ్చు,  శ్రద్ధగా చేస్తారు కనుక.  కాని యజ్ఞాలన్నిటినీ యాగం అనుకోకూడదు. అవి నది, సముద్రం లా వేరువేరు, రెండింటిలోనూ నీరే ఉన్నా. 

యాగం అంటే ముఖ్యంగా ప్రకృతిలోని లోపాలను సరిదిద్దడానికి చేసేది. సకామయాగాలు అంటే పుత్రకామేష్టి, అశ్వమేధం లాంటి యాగాలు కూడా చేస్తూంటారు.

ప్రకృతిలో లోపాలేమిటి అనుకోవచ్చు, మానవకృతాలు. భూమి నీరు గాలి కలుషితమవుతాయి. వర్షాలు పడవు, పంటలు పండవు. వీటిని సరిదిద్దడానికి యాగాలు చేస్తారు/చేసేవారు. దానికి అగ్నిహోత్రం ముఖ్యం. హోమగుండం కూడా వాస్తుప్రకారం ఏర్పాటవుతుంది. అగ్నిలో కూడా ఆవునెయ్యి, రావిసమిధలు లాంటివే మంత్రసహితంగా వెయ్యాలని వేదం చెబుతూంది. అన్నీ వేయకూడదు.

" అగ్నిహోత్రం " వల్ల నిజంగా ఉపయోగముందా అని చాలామందికి సందేహం. సహజమే.

పోలండ్ లోని ఒక శాస్త్రజ్ఞుడికీ ఈ సందేహం వచ్చింది. పరికరాలన్నిటినీ పట్టుకుని ఇక్కడకు చేరిపోయాడు. యాగం జరుగుతూన్నచోట గాలిని నీటిని పరీక్షించాడు. స్వచ్ఛంగా ఉన్నాయి. ఒకేలా ఉన్న హోమగుండాల్లో విడివిడిగా మంత్రాలతోనూ, మంత్రాలతో కాకుండానూ యాగం చేయించి పరీక్షచేసాడు. మతిపోయింది. మంత్రాలతో చేసినచోట ఎక్కువ స్వచ్ఛత కనబడింది. మంత్రాల ప్రకంపనల ప్రభావం.

" అగ్నిహోత్ర " అని అద్భుతమయిన గ్రంధం వ్రాసాడు ఆయన. పోలండులో " హోమ ధెరపీ ఫౌండేషన్ " మొదలెట్టాడు. అది ఎన్నో దేశాలలో జరుగుతూంది ఇప్పుడు..

ఓ అద్భుతం చూద్దాం.  కరోనా సమయంలో ఇటలీ, స్పెయిన్ లలో వేలమంది చనిపోయారు. మాడ్రిడ్ లో ఎం. ఎలిజబెత్ అనే ఆవిడ తన భాగస్వామితో ఓ ఇంట్లో ఉంటున్నారు. ఇల్లు పెద్దదేమో ఓ గదిని హొటల్ నడుపుతూన్న ఒకతనికి అద్దెకిచ్చారు. హొటల్ కి చాలామంది వస్తూంటారు కనుక అతనికి కరోనా ఉధృతంగా వచ్చింది. అతని ఇంట్లో మిగిలిన ఇద్దరికీ పరీక్షచేస్తే నెగెటివ్ వచ్చింది. వారు హొటల్ యజమానితో విందు కూడా తీసుకున్నారుట అంతకు ముందురోజు. విషయమేమిటంటే ఆమె ఇంట్లో రోజూ హోమం చెయ్యడం, హోమ వీభూతి పెట్టుకోవడం చేస్తుందిట. అదే కారణమయి ఉంటుందని హాస్పిటల్ వారు అనుకోవడం, ఆశ్చర్యపోవడం జరిగింది ( ఈ విషయం  నెట్ లో ఉంది ).

హోమంలో ఆవునెయ్యి సమిధలు వెయ్యడంవల్ల గాలిలో వైరస్ తగ్గుతుందని ప్రపంచంలో అందరూ ఒప్పుకుంటున్నారు, మనం తప్ప. 

మనలోని అజ్ఞానాన్ని పోగొట్టమని " పంచయజ్ఞప్రియ " ని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్


Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ