మనం మనలా ఉండేలా సాధనచేస్తూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

🙏"శ్రీమాత్రేనమః"🙏

" స్వస్థా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 914 వ నామం.

" స్వస్తి " అంటే క్షేమం/శుభం అన్నారు కాని అసలు అర్ధం చూద్దాం. " స్వస్థా" అన్నది అమ్మవారి ఒక నామం. స్వ+స్థ = తను + ఉండడం. అంటే తను తనుగా ఉండడం.

ఎవరైనా సరిగ్గాలేరనిపిస్తే " ఏం అలా ఉన్నావు " అంటాం. అతను ఒంట్లో బావుండలేదనో, మనస్సు బావుండలేదనో అంటారు. 

అంటే శరీరం కాని మనస్సు కాని సరిగ్గా లేకపోతే తను తనుగా ఉండడు/ఉండలేడు. అటువంటి స్థితిలోనే చెడు ఆలోచనలు కలగడం చెడుపనులు చేయడం జరుగుతుంది. జీవుడు పతనమవుతాడు.

అమ్మవారు ఈ రెండూ సరిగ్గా ఉండేలా అనుగ్రహిస్తారు. అంటే క్షేమాన్ని యోగాన్ని కలిగిస్తారు.

" స్వస్థా " అంటే మంగళకరమైన ఉత్తర గతులను కలిగించునది అని ఒక భాష్యం చెప్పారు భాస్కరరాయలవారు. అమ్మవారు తనను నమ్ముకున్నవారిని " ఉన్నస్థితినుంచి ఉన్నతస్థితికి తీసుకుని వెడుతారు. అది జీవుడు తను తనుగా ఉన్నప్పుడే సాధ్యం. ఆత్మన్యూనత ( నిరాశ ) తో దిగజారిపోయినప్పుడు కుదరదు. ఆ స్వస్థతను అమ్మవారు కలిగిస్తారు.

" అనిర్వేదశ్శ్రేయోమూలం

  అనిర్వేదః పరంసుఖం

  అనిర్వేదోహి సతతం

  సర్వార్ధేషు ప్రవర్తకః "

ఉత్సాహమే సర్వసంపదలకు, సుఖాలకు మూలం. సదా ఉత్సాహంగా ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి అన్నారు హనుమ సుందరకాండలో.

" స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి 

  స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః " 

          - విష్ణుసహస్రనామం.

అమ్మవారి పాదాలను నమ్ముకుంటే ఏ దిగులూ ఉండదు, జీవుడు తను తనుగా ఉండగలుగుతాడు. కష్టసుఖాలు రెండూ కూడా దరిచేరవు. సమభావన. ఆ స్థితిలో అంతా సచ్చిదానందమే.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

  1. మనిషి ఆలోచ నా విధానాన్ని,అతడి నడవడిని ప్రభావితం చేసేది భగవంతుని ప్రేరణ మాత్రమే. అసలు మనిషి పుట్టుకే అత డి చేతిలో లేనపుడు అతడు చేసే పనులకు అతడు ఎలా కారణం అవుతాడు?
    ఈ ప్రశ్నకు జ్ఞానులు చెప్పే కారణం ఒక్కటే.సృష్టి చేసింది భగవంతుడై నా యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని మనిషి కి ఇవ్వటం వలన అతడి చేతలకు అతడే భాద్యుడు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ